Welcome Guest
Date:2010/09/05
*** Now enjoy 145 characters of unlimited messaging ****
Telugu News

ఈ ఆర్థిక సంవత్సరం 50% వృద్ధి లక్ష్యం: ఎల్ అండ్ టీ :ప్రముఖ మౌలికసదుపాయాల సంస్థ ఎల్ అండ్ టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కో లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం భారీ వృద్ధిని ఆశిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ రూ. 4,500 కోట్లు సాధించిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో 50శాతం వృద్ధి సాధించగలదని అంచనా వేస్తున్నట్లు ఎల్ అండ్ టీ ఇన్ఫ్రా ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీత్ కె మహేశ్వరి తెలిపారు.    Click to read complete description



రష్యా మిలిటరీ క్యాంప్‌పై మానవ బాంబు దాడి!! :ఓ వైపు కార్చిచ్చు సమస్యతో కొట్టుమిట్టాడుతున్న రష్యా ప్రభుత్వానికి మరోవైపు తీవ్రవాద సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐదు మంది మరణించగా 39 మందికి పైగా గాయపడ్డారు. రష్యాలోని దక్షిణ కాస్కాసస్ ప్రాంతంలోని దగేస్థాన్‌‌లో ఉన్న సైనిక శిభిరాలను లక్ష్యంగా చేసుకొని మానవ బాంబు దాడి జరిగింది.    Click to read complete description



ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను అరెస్టు చేయాలి: తేదేపా నేత గౌడ్ :ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్ వెంకట్రామిరెడ్డిని తక్షణం అరెస్టు చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్షలను తుపాకీ నీడలో నిర్వహించడం సబబు కాదన్నారు. అసలు ఇలా నిర్వహించిన పరీక్షలు పరీక్షలే కావన్నారు. అందువల్ల వీటిని తక్షణం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.    Click to read complete description



గౌతమాలలో వరదలు: 14 మంది మృతి- ఎమర్జెన్సీ ప్రకటన! :మెక్సికో - సెంట్రల్ అమెరికా సరిహద్దుల్లో ఉన్న గౌతమాల దేశాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. గత కొద్ది వారాలుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మట్టి పెళ్లలు విరిగి ఓ బస్సుపై పడటంలో అందులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో సంఘటనలో ఓ ఇంటిపై విరిగి పడిన మట్టి పెళ్లలు నలుగురిని బలి తీసుకున్నాయి.    Click to read complete description



భద్రత మధ్య ముగిసిన గ్రూప్-1 పరీక్షలు: పలువురి అరెస్టు! :రాష్ట్ర వ్యాప్తంగా 445 కేంద్రాల్లో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలు భారీ భద్రత నడుమ ముగిశాయి. పోలీసు అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు కల్పించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా చేయడంలో సఫలమయ్యారు. జంట నగరాల్లోని 128 కేంద్రాల్లో భద్రతను అత్యంత పటిష్టంగా ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక పోలీసు బలగాలు భద్రతను పర్యవేక్షించాయి. ఒక్కో కేంద్రం వద్ద 20 నుంచి 50 మంది పోలీసులు పహారా కాశారు. అభ్యర్థులను, హాల్‌టిక్కెట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆయా కేంద్రాల్లోకి వారిని అనుమతించారు.    Click to read complete description



5.2శాతానికి పడిపోయిన ప్రపంచ కాఫీ ఎగుమతులు :ప్రపంచవ్యాప్తంగా కాఫీ ఎగుమతులు 5.2శాతానికి పడిపోయి 78.45 మిలియన్ బ్యాగులకు చేరుకుంది. 2009-10 పంట సంవత్సరంలో తొలి పది నెలలకు గానూ ఈ తగ్గుదల సంభవించినట్లు బ్రిటన్‌కు చెందిన అంతర్జాతీయ కాఫీ విభాగం తెలిపింది. కాగా.. భారత్, ఇండోనేషియాలలో మాత్రం కాఫీ ఎగుమతులు పెరిగాయి.    Click to read complete description



ఖైదీలే పోలీసులై.... మద్యం ఖాకీలను రక్షించిన వైనం! :ఖైదీలే పోలీసులైతే..? ఇంకేముంది దేశాన్ని దోచుకు తినైరూ... అంటారా..!? మిగతా వాళ్ల సంగతేమో కానీ.. వాళ్లిద్దరూ మాత్రం అలా కాదు. పారిపోయో అవకాశం ఉండి కూడా పారిపోకుండా ఫుల్లుగా మందు కొట్టి పడిపోయిన పోలీసులను జాగ్రత్తగా పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి మరీ లొంగిపోయారు. అబ్బా.. అయితే మంచి ఖైదీలే అంటారా..! అనక తప్పదు మరి.    Click to read complete description



విద్యార్థుల జీవితాలో చెలగాటమాడొద్దు: ఎంపీ లగడపాటి :ఏపీపీఎస్సీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డిని వంకగా చూపి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ హితవు పలికారు. గ్రూప్-1 పరీక్షలను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ నేతలు చేసిన యత్నాలను ఆయన ఖండించారు.    Click to read complete description



ఎనిమిదేళ్లలో 109 మిలిటెంట్లు లొంగిపోయారు: తకో దబీ :అరుణాచల్‌ప్రదేశ్‌లో గడచిన ఎనిమిదేళ్ల నుంచి ఇప్పటి వరకూ కనీసం 109 మంది వివిధ గ్రూపులకు చెందిన మిలిటెంట్లు భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్ధాలతో సహా లొంగిపోయారని ఆ రాష్ట్ర ప్రబభుత్వం వెల్లడించింది. వీరిలో చాలా మంది సమస్యాత్మకమైన తిరప్, చంగ్లాంగ్ జిల్లాల నుంచే లొంగిపోయినట్లు అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర హోం మంత్రి తకో దబీ తెలిపారు.    Click to read complete description



ప్రశాంతంగా సాగుతున్న గ్రూప్-1 పరీక్షలు: ఏపీపీఎస్సీ ఛైర్మన్ :గ్రూప్-1 పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా సాగుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ఈ పరీక్షలకు సీమాంధ్ర ప్రాంతాల్లో 65 శాంత మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. అలాగే, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 45 శాతం, తెలంగాణ ప్రాంతంలో 35 శాతం మేరకు అభ్యర్థులు హాజరైనట్టు ఆయన తెలిపారు.    Click to read complete description



డబ్లిన్‌లో టోనీ బ్లెయిర్‌కు బూట్లు, కోడిగుడ్లతో స్వాగతం! :బూట్లు విసిరించుకున్న నాయకుల జాబితాలో బ్రిటీష్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ కూడా చేరిపోయారు. తన జ్ఞాపకాలతో కూడిన పుస్తకాలపై సంతకాల కార్యక్రమం కోసం మొదటిసారిగా డబ్లిన్‌కు వచ్చిన బ్లెయిర్‌కు ఘోర పరాభవమే ఎదురైంది. యుద్ధ వ్యతిరేక ప్రదర్శకులు బ్లెయిర్‌పై బూట్లు, కోడిగుడ్లు విసిరారు. అనేక మంది బ్లెయిర్‌వి ‘రక్తపు మరకల చేతులు’ అంటూ నినాదాలు చేశారు.    Click to read complete description



సెప్టెంబర్ 7న సార్వత్రిక సమ్మె: కార్మిక సంఘాలు! :ఈ నెల 7 నుంచి బెంగాల్‌ రాష్ట్రవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జరపటానికి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెను పూర్తిగా విజయవంతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా కార్మికలోకం సమాయత్తమవుతోంది. ఈ సమ్మెకు రాజకీయ అనుబంధాలకతీతంగా ఉద్యోగ, కార్మిక వర్గాలు సంఘీభావం ప్రకటించాయి.    Click to read complete description



ఎల్ అండ్ టీ చేతికి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు! :ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు ప్రాజెక్టు ఎట్టకేలకు కార్యరూపందాల్చింది. ఈ ప్రాజెక్టు పనులను దక్కించుకున్న ఎల్‌ అండ్‌ టి (లార్సెన్‌ అండ్‌ టూబ్రో) సంస్థతో ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సమక్షంలో శనివారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి టి.ఎస్‌.అప్పారావు, ఎల్‌ అండ్‌ టి హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.బి.గాడ్గిల్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.    Click to read complete description



నక్సల్స్ ప్రభావిత జిల్లాలకు రూ.13,742 కోట్ల ప్యాకేజీ :దేశంలోని నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లోని జిల్లాలకు కేంద్ర ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కేటాయించింది. మొత్తం 13,742 కోట్ల రూపాయల విలువ చేసే ఆర్థిక ప్యాకేజీతో ఈ జిల్లాల్లో రోడ్లు, విద్యుత్ ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు రూపొందిస్తారు. ఈ ప్యాకేజీ కేటాయింపునకు కేంద్ర మంత్రివర్గం త్వరలోనే ఆమోదం తెలుపనుంది.    Click to read complete description



రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో కోడిగుడ్లు ధరలు :రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో ఆదివారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.216 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.2.35గా ఉంది.అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.218గాను, విజయవాడలో రూ.221, విశాఖపట్నంలో రూ.233, గోదావరి మార్కెట్‌లో రూ.221, తూర్పుగోదావరిలో రూ.221, చిత్తూరులో 231 రూపాయలుగా ఉంది. ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.238 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నామక్కల్‌లో 235 రూపాయలుగా పలుకుతోంది.    Click to read complete description



స్వదేశంలో విదేశీ కరెన్సీ రేట్లు :విదేశీ కరెన్సీ రేట్లు ఈ విధంగా ఉన్నాయిఅమెరికా డాలరు కొనుగోలు రేటు (థామస్ కుక్) 43.95, అమ్మకపు రేటు (రూ.లలో) రూ.49.15.యూరో కరెన్సీ కొనుగోలు రేటు (థామస్ కుక్) 56.20, అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 62.70.జపాన్ యెన్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 51.75, అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 57.60. బ్రిటన్ పౌండ్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 68.00, అమ్మకపు రేటు రూ. 75.45.    Click to read complete description



బందీలకు విముక్తి: చర్చలకు మావోయిస్టలకు తిరస్కృతి! :తమ చెరలో ఉన్న ముగ్గురు పోలీసులను విడిపించేందుకు మావోయిస్టులు అంగీకరించినట్టు సమాచారం. అయితే, ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు వారు నిరాకరించారు. గత ఆదివారం కిడ్నాప్ చేసిన నలుగురు పోలీసులలో ఒకరిని మావోయిస్టులు హత్య చేసిన విషయం తెల్సిందే. దీంతో ప్రభుత్వం శనివారం సాయంత్రం అప్రమత్తమై అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఇందులో బందీల విముక్తి కోసం మావోయిస్టులతో చర్చలు జరపాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.    Click to read complete description



నేటి బులియన్ మార్కెట్ ధరలు :నేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.ముంబై మార్కెట్‌లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర రూ. 19,060. అలాగే 99.5 రకం బంగారం ధర రూ. 18,970 ఉంది. కిలో వెండి ధర 31,690 రూపాయలుగా ఉంది. విజయవాడ మార్కెట్‌లో బంగారం (24 క్యారెట్లు) 19,235 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 17,800 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 31,400 రూపాయలుగా ఉంది.చెన్నై మార్కెట్‌లో 24 క్యారెట్లు బంగారం ధర 19,055రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర 1,772 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 31,955 రూపాయలుగా పలుకుతోంది.    Click to read complete description



ముంబై దాడులు: విచారణ కమిషన్‌కు యోచన: రెహ్మాన్ :ముంబై దాడులతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా ఆపరేషన్ కమాండర్ జకీవుర్ రెహ్మాన్‌తో సహా మరో ఆరుగురిపై విచారణ ఆగిపోయిందని పాకిస్థాన్ వెల్లడించింది. ఈ విచారణ ముందుకు సాగాలంటే ఈ కేసులో కీలకమైన ఇద్దరు భారతీయ సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడానికి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని పేర్కొంది. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్టు పాకిస్థాన్ అంతర్గత భద్రతా శాఖామంత్రి రెహ్మాన్ మాలిక్ వెల్లడించారు.    Click to read complete description



గురువుపై కుళ్లుజోకులు మొట్టికాయలు.. ఇదేనా గురుపూజ :ఈ రోజు మనం అందరం ఈ స్థాయిలో ఉన్నామంటే మన వెనుక ఎవరో ఒకరి ప్రోత్సాహం, ప్రోద్బలం, మార్గదర్శకం ఉండే ఉంటుంది. ఆ శక్తే గురువు. ప్రతి మనిషికి తొలి గురువు తల్లి. తర్వాత గరువును మనం ప్రత్యక్షంగా చూడగలిగేది పాఠశాలలోనే. ఇక్కడి నుంచే మన జీవితం ప్రారంభం అవుతుంది. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాం. సమాజంలో ఎలా బ్రతకాలో తెలుసుకుంటాం. పాఠశాల జీవితం తర్వాత మన జీవితంలో చాలామంది గరువులు ప్రత్యక్షమవుతారు.    Click to read complete description




 

Fatal error: Cannot redeclare readmyfile() (previously declared in /home/eezysms/public_html/veezy/rssfeeds/unhtml.php:12) in /home/eezysms/public_html/veezy/inc/horizmessage.php on line 23